Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాంప్రసాద్
నవతెలంగాణ -ఆలేరురూరల్
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలు అభివద్ధి జరుగుతున్నాయని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బక్క రాంప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం గ్రామంలో ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలనుపాక గ్రామ నుండి రాఘవపురం తారు రోడ్డు వేయడానికి రూ.64 లక్షలా 50 వేలు, అదేవిధంగా సీసీ రోడ్డుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.20 లక్షలు , కురుమ సంఘం భవనానికి అదనపు నిధులు మంజూరు చేయించినందుకు కతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు సంతోష్ , ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశం ,,రైతు విభాగం మండలాధ్యక్షుడు రామిరెడ్డి,, యువజన విభాగం సెక్రటరీ జనరల్ మల్లేశం ,పార్టీ నాయకులు శ్రీశైలం, మహేందర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.