Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరే కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 12వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు పాత్ర కీలకమని, అలాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సుస్థిరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యువత తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామి కావాలన్నారు. ఈ సంవత్సరం 3307 మంది నూతనంగా ఓటు హక్కు పొందారని తెలిపారు. భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, జిల్లా టీజీఓ అధ్యక్షులు ఎం.ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరెడ్డి, సీనియర్ సీటీజన్ ఓటర్లు బాలకష్ణారెడ్డి,బీఎన్.రెడ్డి, నరసింహారావు ఓటు ప్రాధాన్యత, ఓటరు బాధ్యతల గురించి వివరించారు. అనంతరం సీనియర్ సిటీజన్ ఓటర్లను సన్మానించారు. యువతీ యువకులకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వర చారి, జిల్లా ఎన్నికల కార్యాలయ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.