Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు
ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అభివద్ధిలో ముందంజలో ఉందని మున్సిపల్ చైర్మెన్ వసపరి శంకరయ్య అన్నారు. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని వివిధ అభివద్ధి పనులకు ,సీసీి రోడ్ల నిర్మాణాలకు రూ.26 లక్షలు ,యూజీడీ నిర్మాణాలు రూ.21 లక్షలు, వార్డు సోమేశ్వర వెంచర్లో నర్సరీ ఏర్పాటుకు రూ.5లక్షలు, పదో వార్డు నారాయణ రెడ్డి వెంచర్లు ఓపెన్ జిమ్ రూ. 12 లక్షలతో సాధారణ పట్టణ ప్రగతి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఏర్పాటు చేసేందుకు ఆమోదించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదు, మేనేజర్ శ్రీధర్ రెడ్డి ,వైస్ చైర్మెన్ మురగాడి మాధవి వెంకటేష్ ,కౌన్సిలర్ సునీత ,రాములు, భూపతి, సమంత రెడ్డి,నర్సింలు,సునీత ,నాగలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.