Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ వ్యాప్తంగా 11 కోట్లతో అభివద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలు, పాలకవర్గం, ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానన్నారు. సబ్‌ప్లాన్ కింద కోటి 50 లక్షలతో 14, 15 కార్పొరేషన్ నుండి రెండు కోట్లతో మురుగుకాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, తంగడపల్లి రోడ్డులో 4.50 కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 9 శ్మశానవాటికలను రెండు కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. కోటి రూపాయలతో నాలుగు డంపింగ్ యార్డులు, 60 లక్షలతో పది ప్రకతి వనాలు, 20 లక్షలతో పట్టణ ప్రగతి పనులు, 50 లక్షలతో హరితహారం పనులు తదితర అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎస్ఆర్ ఫండ్ కోటి 20 లక్షలతో నాగులకుంట ఆధునీకరణ, కోటి 30 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి అంతస్తు నిర్మాణంతోపాటు గాంధీ పార్కు, పైలాన్ పార్కు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. పట్టణ అభివద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు.