Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి, కలెక్టర్ పర్యటన
అ సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. గ్రామసభలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రెండేండ్లుగా కరోనా కారణంగా దత్తత గ్రామాలను ఎంపిక చేయలేదని, ఈ ఏడాది కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా వడపర్తిని దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నామని తెలిపారు. గతంలోని వడపర్తి గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వీధి దీపాలకు కోసం రెండున్నర లక్షలు వెచ్చించి ఎల్ఈడీ లైట్లకు సహకరించినట్టు తెలిపారు. 9ఏండ్ల లో టీిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చినవే ఉన్నాయన్నారు. రైతులు గ్రామాల్లో 30 శాతం కూడా వరి వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. రైతులు , కౌలు రైతులు ఎలా బతకాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూలు ప్రహరీ గోడ నిర్మాణం, రైతులకు విద్యుత్ సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా చర్యలు చేపడ్తామన్నారు. గ్రామంలో వంద మందికి ఇండ్ల స్థలాలు కేటాయించారని, వాటిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కేసీఆర్కు లేఖ రాస్తానని తెలిపారు. రూ.24 కోట్లతో బస్వాపురం ,బీబీనగర్ చెర్వుకు, భువనగిరి చెర్వుకు కాల్వ నిర్మాణాలకు పనులు జరుగుతున్నాయన్నారు. 4 కోట్లతో వడపర్తి కత్వ నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బూరు వీరమల్లయ్య, తహసీల్దార్ వెంకట్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, వాడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కష్ణారెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, ఉప సర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ రాములు యాదవ్, వార్డు సభ్యులు మౌనిక, తుమ్మల సత్తయ్య, తుమ్మల కవిత, భాస్కర్ పాల్గొన్నారు.