Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మంగళవారం నల్లగొండకు వెళ్తున్న సందర్భంగా పట్టణకేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, ఏరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మండల, పట్టణ అధ్యక్షులు రిక్కల సుధాకర్‌రెడ్డి, ఉడుగు వెంకటేశంగౌడ్, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, బత్తుల జంగయ్యగౌడ్, పాలకుర్ల జంగయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.