Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కోదాడరూరల్
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రఘు తెలిపారు. మంగళవారం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్లో టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అశోక్ నగర్ కు చెందిన షేక్ మస్తాన్ తండ్రి తాజుద్దీన్‌ను పోలీసులు అనుమానాస్పదంగా ఉండటం గమనించారు. అదుపులోకి తీసుకొని విచారించగా పట్టణ పరిధిలోని అశోక్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేసేవాడు. ఈ నెల5న పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో విజయవాడ హైవే పక్కన ఉన్నపూస వెంకట్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు , లక్ష రూపాయల నగదు, 276 అమెరికన్ డాలర్లు పహరించుకుపోయాడు. అతని వద్దనుండి 74 వేల రూపాయల నగదు ,బంగారు ఆభరణాలు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట టౌన్ సీిఐ నరసింహారావు, ఎస్సై రాంబాబు క్రాంతి కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.