Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దఅడిశర్లపల్లి
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో దుగ్యాల దగ్గర ఏఎంఆర్పీ కాల్వలో ప్రమాదవశాత్తు ఇద్దరు బాలుర్లు గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ వీరబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామపంచాయతీ పరిధిలోని నెమళ్ళ గూడానికి చెందిన బుడగ జంగాల కులస్తులు ఊరూరు తిరుగుతూ చిత్తు కాగితాలు, పాత సామాను, ఖాళీ సీసాలు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో దుద్యాల బ్రిడ్జి వద్ద ఆగి కాగితాలు సేకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కప్పేర సిద్దు(12) కాలుజారి కాలువలో పడ్డాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో కొండపల్లి రాము(20) కాల్వలోకి దిగాడు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చెరువులోకి వారు కొట్టుకుపోతుంటే కుటుంబ సభ్యులు కొండపల్లి లక్ష్మణ్, కొండపల్లి సైదులు, కప్పెర రాజు, కప్పెర రమేష్ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న కొండమల్లేపల్లి సీిఐ వై రవీందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పుట్టంగండిలో మోటార్లను ఆప్ చేయించామని, నీటి ప్రవాహం తగ్గుతుందని రేపు గజ ఈతగాళ్లతో గల్లంతైన వారిని వెతికిస్తామని తెలిపారు.