Authorization
Sat April 12, 2025 04:49:50 am
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఒక నిర్ణయం తీసుకుంటే పట్టుదలతో పని చేసి పూర్తి చేసే వ్యక్తి బండ్రు నరసింహులు అని అరుణోదయ సాంస్కతిక సమైక్య రాష్ట్ర కన్వీనర్ విమలక్క అన్నారు. మంగళవారం మండలంలో లక్ష్మీ గార్డెన్లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. నరసింహులుకు ఈ ప్రాంతంతో ఎనలేని సంబంధం ఉందని, అనేక పోరాటాల్లో నిర్బంధాలు,జైలు, అజ్ఞాతం జీవితం అనుభవించారన్నారు. ఈనెల 30 ఉదయం 10గంటల సమయంలో నరసింహులు సంతాప సభ ఉంటుందని అందుకు అభిమానులు ,కుటుంబ సభ్యులు, విప్లవ గ్రూపుల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి చిన్న కుమారుడు భాస్కర్, కోడలు శోభారాణి ,సీనియర్ అడ్వకేట్ జూకంటి రవి, సీపీఐ ఎంఎల్ జనశక్తి జిల్లా నాయకులు రామకష్ణ , మోహన్ రెడ్డి, విష్ణుమూర్తి, సత్తన్న ,పేద్దులు, కష్ణ పాల్గొన్నారు.