Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకీడు
మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, స్థానిక ఎస్ఐ సైదులు గౌడ్ పరిశీలించారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉర్సుకు వచ్చే భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దర్గా యజమాని ఏర్పాటు చేసిన క్యూ లైన్ ప్రదేశాలను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.