Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రయివేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రయివేటు ఉద్యోగుల సంఘం డైరీ,క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు.తెలంగాణ ఉద్యమంలో ప్రయివేట్ ఉద్యోగులు కూడా ఎంతో కషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గుండు రాంబాబు గౌడ్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె. ఖలీల్ అహ్మద్ ఉపాధ్యక్షులు సాతునూరి నాగ బిక్షం,బాలరాజు, మగ్గుల్ పాషా,టి.వెంకట రమణ రెడ్డి,సిహెచ్.నరేష్, పి.నవీన్,చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షులు పిట్ట రాజశేఖర్ రెడ్డి నాయకులు,కె గోవర్ధన్, ఎస్.లింగమూర్తి, నరసింహాచారి, ఏకస్వామి, వెంకటాచారి, నవీన్ రెడ్డి ,మీసాల పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.