Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భూగర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించి తనిఖీ చేశారు. క్లాక్ టవర్ ఐబీ కార్యాలయ ఆవరణలో ఉన్న భూగర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని తాత్కాలికంగా పాత జెడ్పీ కార్యాలయంలోకి తరలించారు. నల్గొండ జిల్లాలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన లో క్లాక్ టవర్ వద్ద ఉన్న ఐబీ, ఆర్అండ్బీ, భూగర్భ జలవనరుల శాఖ కార్యాలయాలను పరిశీలించి పట్టణ అభివద్ధికి సూచనలు చేస్తూ వాటి స్థానంలో అధునాతన నీలగిరి కళాభారతి, కొత్త కార్యాలయంలు నిర్మించాలని సూచించారు. ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆదేశాలను అనుసరించి భూ గర్భ జలవనరుల శాఖ డీడీ కార్యాలయాన్ని పాత జెడ్పీ భవనంలోకి తరలించారు. కార్యాలయంకు అవసరమైన స్టార్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని జెడ్పీసీఈఓ, పీఆర్డీఈలను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం భూగర్భ జలవనరుల శాఖ గ్రామ వారీగా 2019-20 సంవత్సరంకు భూగర్భ జలవనరుల మదింపు చేసి రూపొందించిన మదింపు పుస్తకంను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ బాలకేంద్ర భవనం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూగర్భ జలవనరుల శాఖ డీడీ సునీల్ బాబు, జెడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి, పంచాయతీ రాజ్ డీఈ.నాగయ్య, డీఈఓ భిóక్షపతి పాల్గొన్నారు.