Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి
నవతెలంగాణ- గరిడేపల్లి
వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాల్లో యువత వత్తి నైపుణ్యత శిక్షణను పొందడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైది రెడ్డి అన్నారు. మంగళవారం నాడు కేవీకే గడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ పద్ధతిలో తేనే టీగల పెంపకం శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొని యువత నిద్దేశించి ప్రసింగించారు. ప్రస్తుత పరిస్థితులలో యువత వ్యవసాయం తోపాటు, ఉద్యాన వన, చేపల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, పుట్ట గొడుగుల పెంపకం, కోళ్ల పెంపకం మొదలగు రంగాల్లో సాంకేతిక శిక్షణ పొందడం ద్వారా యువత స్వయం ఉపాధితో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు అందించ వచ్చునని అన్నారు. సూర్యాపేట జిల్లా రైతాంగానికి కేవీకే ఒక వరం లాంటిదన్నారు. కేవీకే అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. గత వారం రోజులుగా తేనే టీగల పెంపకం పై నిరహించి న శిక్షణ అంశాల గురుంచి ఉద్యాన శాస్త్రవేత్త సిహెచ్ నరేష్ వివరించారు. కేవీకే వత్తి నైపుణ్యత శిక్షణ లకు ప్రాధాన్యత నిస్తూ గత 35 సంవత్సరాలనుండి ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు రైతులకు వ్యవసాయం అనుబంధ రంగాల్లో చేసిన కషికి గాను భారత వ్యవసాయ పరిశోదనా మండలి వారి ద్వారా ఎన్నో అవార్డ్స్ పొందామని ఈ ఆర్థిక సంవత్సర ములో నిర్వహించిన పలు కార్యక్రమాల గురించి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్ వివరించారు. ప్రభుత్వ సంస్థ ల సహకారం తో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద వెయ్యి మందికి పైగా శిక్షణ కార్యక్రమాలు నిరహించా మని త్వరలో గడ్డిపల్లి లో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కషి చేస్తున్నామని సంస్థ కార్యదర్శి. జి. సత్యనారాయణ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. అనంతరం కేవీకేలోని తేనే టీగల పెంపకం, జీవన ఎరువుల ఉత్పత్తి మరియు వివిధ ప్రదర్శన ఉత్పత్తి కేంద్రాలను శాసన సభ్యులు శాస్త్రవేత్తల్తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమం లో హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మెన్కడియం వెంకట్ రెడ్డి, మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్, సర్పంచ్ సుందరి నాగేశ్వర్ రావు, ఎంపీటీసీ మేకల స్రవంతి శోభన్ బాబు, ప్రజా ప్రతినిధులు, స్వర్ణ శ్రీనివాస్ రెడ్డి, మాశెట్టి శ్రీహరి మాజీ సర్పంచ్ తదితరులు కేవీకే శాస్తవేత్తలు ఏ. కిరణ్,డి. నరేష్, టి. మాధురి, ఎన్. సుగంది, డి.ఆదర్శ్, ఆఫీస్ , బి. సత్యనారాయణ రెడ్డి, ఎమ్. సైదులు, రామ్ రెడ్డి, బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.