Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తాగిన మత్తులో టీిఆర్‌ఎస్ కుక్కలను ఊసిగొల్పుతవా
అ సీఎం కేసీఆర్‌పై సంజరు ఘాటైన వ్యాఖ్యలు
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గుండావా... ముఖ్యమంత్రివా , ప్రజా సంక్షేమ కార్యకమ్రాలకు వెళుతున్న ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ కుక్కలను ఊసిగొల్పుతవా అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూధన్‌రెడ్డి అమ్మగారి మరణించడంతో ఆ కుటుంబానికి పరామర్శించేందుకు మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. అనంతరం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ గుండాలు, పోలీసుల కలిసి చేసిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు.తమ పార్టీ కార్యకర్తపై కత్తులతో దాడిచేశారని, ఎంపీ వాహనంపై రాళ్లు రువ్వితే కార్యకర్త కండ్లల్లో సీసం ముక్కలు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించమని పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేస్తే స్పందనలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, స్వయంగా సీఎం కేసీఆర్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి, పార్లమెంటు స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. నాడు ఉద్యమం కోసం మరణిస్తే ... నేడు ఉద్యోగాల కోసం మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడు ముత్యాల సాగర్ మృతిపట్ల ఆయన సానుభూతిని తెలిపారు. పక్కా జిల్లాకు బదిలీ చేయొద్దని కోరుతూ వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాద్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఎవరికోసం వచ్చిందో అర్థం కావడంలేదన్నారు. ప్రభుత్వం 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు జరిగిన ఈఎస్ఐ, పిఎఫ్ లలో జరిగిన స్కామ్‌లను, ఎలుగుబంటి సూర్యనారాయణ ఎపిసోడు ఆ తర్వాత జరిగిన అవినీతి మొత్తాని బయటికి తీస్తున్నామని తెలిపారు. తెలంగాణ బిల్లు పెడితే ఓటు వేయని కేసీఆర్, ఈయన చేసిన దీక్షలన్నీ దొంగదీక్షలని అందరికి తెలిసిందేనన్నారు. గిరిజన యూనివర్సీటీ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉంటే స్థలం ఇవ్వడంలో జాప్యం చేస్తున్న సీఎం కేంద్రాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, సమస్యలపై అఖిలపక్షం మీటింగ్ పెట్టి అందరికి దళితబంధు, గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్లో ఐఏఎస్‌లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నావని, అత్మాభిమానం కలిగిన ఐఏఎస్‌లో పనిచేయలేకపోతున్నారని తెలిపారు. 'నీ'కోసంపనిచేసే వారికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి లాలుచి పడుతున్నావన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, ప్రదీప్‌కుమార్, బంగారు శృతి, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ప్లోర్ లీడర్ బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య పాల్గొన్నారు.