Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 3, 12 వార్డులలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దశలవారీగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో నకిరేకల్ను మోడల్టౌన్గా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మద ధనలక్ష్మి నగేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు చింత స్వాతి త్రిమూర్తులు, బానోతు వెంకన్న, కందాల భిక్షంరెడ్డి, కొండ శ్రీను, గడ్డం లక్ష్మీ నరసింహస్వామి, నాయకులు పగడపు నవీన్, రాచకొండ వెంకన్న, ఎల్లపు రెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.