Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవ తెలంగాణ-మోత్కూరు
ఫొటోగ్రాఫర్లు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని వత్తిలో నైపుణ్యం పెంచుకోవడానికి వ షాపులుఎంతో ఉపయోగపడతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మోత్కూరుమధుర మీనాక్షి ఫక్షన్ హాల్లో నిర్వహించిన ఫొటో వర్క్ షాప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ఫొటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కొత్త కొత్త టెక్నాలజీతో కెమెరాలు వస్తున్నాయని, వాటిని సమర్ధవంతంగాఉపయోగియుకోవడానికి ఫొటో, వీడియో గ్రాఫర్లు వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరు ప్రదీశర్మ మెమొంటోలు బహూకరించగా,ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ కు జ్ఞాపిక అందజేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, సింగిల్ విండో చైర్మెన్‌్ కంచర్ల అశోక్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్‌్ బి.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.