Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎల్లప్పుడూ మంత్రిని అభినవ అంబేద్కర్గా పిలుచుకుంటాం
అ రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ -సూర్యాపేట
ప్రజల విశ్వసనీయత, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం రెండేండ్ల పాలన అని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె గురువారం నవతెలంగాణ విలేకరితో కొన్ని అంశాలను పంచుకుంది.
ఆమె మాటల్లో... సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా 9 వార్డు నుంచి గెలుపొందిన నాకు ఊహించని విధంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నియామకం చేశారు. ఆరోజు జీవితంలో మార్చిపోలేని రోజుగా చెప్పారు. మంత్రి అందించిన పదవికి ప్రజల మన్ననలతో ఎంతో విధేయతతో,నిబద్ధతతో సేవలందిస్తూ రెండేండ్లు పూర్తి చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఒక జనరల్ స్థానంలో ఎస్సీ అయిన నన్ను చైర్ పర్సన్‌గా మంత్రి జగదీశ్ రెడ్డి నియమించారు. అందుకు ఇంతటి గుర్తింపు నిచ్చిన మంత్రిని నేను అభినవ అంబేద్కరుడుగా ఎల్లప్పుడు పిలుచుకుంటాం. అందుకు మంత్రికి నా కుటుంబ సభ్యులమంతా జీవితాంతం రుణపడి ఉంటారు. మంత్రి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా వివిధ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని అన్ని విధాలా అభివద్ధి చేస్తూ, ప్రజా సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కరిస్తూ గత రెండేండ్లుగా ప్రతి ఒక్కరికీ విధేయురాలిగానే ఉంటున్నా. మంత్రి జగదీశ్ రెడ్ది సహకారంతో కోట్ల రూపాయల నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నా. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పరిశుభ్రమైన పట్టణంగా సూర్యాపేట రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దేశంలో అత్యున్నత స్థానం సాధించేందుకు పాలకవర్గం అధికారులు కషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్ట కిషోర్,వార్డు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటారు.
రెండేండ్ల పాలనలో పేటలో జరిగిన అభివద్ధి పనులు
జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో రూ. 21 లక్షల వ్యయంతో దేశం గర్వించదగ్గ వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.
-రూ.14 కోట్లతో శ్మశాన వాటికలు,రూ. 31.66 కోట్లతో పాత జాతీయ రహదారి విస్తరణ పనులు
-48 వార్డుల్లో నాటిన మొక్కలు 7 లక్షల. గ్రీన్ బడ్జెట్ కింద రూ.4 కోట్లతో ఐటీ పార్కులు నర్సరీలు ఏర్పాటు
- రూ.20 కోట్లతో వార్డుల్లో అంతర్గత రోడ్లు,మురికి కాలువలు,కల్వర్టుల నిర్మాణం.
- ప్రజల సౌకర్యార్థం పట్టణంలోని తొమ్మిది ప్రాంతాల్లో రూ.2 కోట్లతో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు.
- మహిళల సౌకర్యార్థం రూ. 10.50 లక్షలతో మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటు.
- 48 వార్డుల్లో 6,500 ఎల్ఈడీ లైట్లను అమర్చడం.
- రూ.1.25 కోట్లతో ట్యాంక్‌బండ్ నుంచి జనగామ క్రాస్ రోడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.
- రూ.250 లక్షల వ్యయంతో 60 ఫీట్ల రోడ్డును సీసీ రోడ్డుగా మార్పు.
- రూ.76 లక్షలతో సద్దుల చెరువుపై లైటింగ్ ఏర్పాటు.
- రూ.4 కోట్ల వ్యయంతో పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
- రూ.750 లక్షలతో పాత వ్యవసాయ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం
- మిషన్ భగీరథ ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.