Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-చిలుకూరు
గ్రామాలభివద్ధికి నిరంతరం టీిఆర్ఎస్ ప్రభుత్వం కషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని పోలేని గూడెంచ చిన్నారి గూడెంచ ఆచార్యుల గూడెం గ్రామాల్లో పల్లె ప్రకతి వనాలు, డంపింగ్యార్డు, శ్మశాన వాటికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనాలు డంపింగ్ యార్డులు వంటి అభివృద్ధి పనులు టీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జరుగుతున్నాయన్నారు. 60 ఏండ్ల కాలంలో జరగని అభివద్ధి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతోందని గత పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత గత పాలకులకు లేదన్నారు. గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో కండ్ల కట్టినట్టుగా కనపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండా సైదయ్య , ఎంపీపీ బండ్ల ప్రశాంతి, కోటయ్య , జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష ,నాగేంద్రబాబు , జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జానీ మియా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్ బాబు ఆయా గ్రామాల సర్పంచులు కమతం కొండలు మూసీ లక్ష్మీనారాయణ ఎంపీడీవో ఈదయ్య, పాల్గొన్నారు.