Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కోదాడరూరల్
గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి అన్నారు. గురువారం మండల పరిదిలోని గుడిబండిగామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. గ్రామాభివద్ధికి ప్రణాళికా బద్దంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివద్ధి చేయడానికి నా వంతు శక్తివంచన లేకుండా కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలివేలు మంగమ్మ, పంచాయతీ కార్యదర్శి ఫాతిమా,వార్డు సభ్యులు శేషు,రఫీ, బిక్షం, అంబేద్కర్,మండల మహిళ అధ్యక్షురాలు నర్సింగోజు గీత,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.