Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 23వ జాతీయ మహాసభ ప్రతినిధుల బందంలో సభ్యురాలు
నవతెలంగాణ- సూర్యాపేట
ఇటీవల రాష్ట్ర రాజధానిలోని తుర్కయాంజల్ జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల నేపథ్యంలో రాష్ట్ర అధినాయకత్వం మల్లు లక్ష్మిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎంపిక చేసింది. కేరళ రాష్ట్రంలోని కన్నూరులో జరగబోయే ఆ పార్టీ 23వ జాతీయ మహాసభ ప్రతినిధుల బందంలో సభ్యులరాలిగా ఎంపిక అయ్యారు. నిత్యం ప్రజా పోరాటాల్లో ముందుండే మల్లు లక్ష్మి గత ఉద్యమ చరిత్రను పరిశీలిస్తే 1996 లో ఐద్వా సభ్యత్వం పొందారు. 2002లో పార్టీ సభ్యురాలిగా, అనంతరం నల్లగొండ పట్టణ కమిటీ సభ్యురాలిగా, 2006లో సూర్యాపేట మండలం రాయిని గూడెం గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2011లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఐద్వా కార్యదర్శిగా,2015లో జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలిగా, 2018 లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు.