Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలోని బస్వాపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ నిధుల నుండి రూ.20 లక్షలతో స్కూల్ ఆవరణలో తరగతి గది, ఎస్సీ కాలనీలో గల కమ్యూనిటీ హాల్ ప్రహరి గోడ , అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులకు గురువారం ఎంపీపీ నరాల నిర్మల-వెంకటస్వామి యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పెళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య ,ఎంపీటీసీలు సామల వెంకటేష్ ,బొక్క కొండల్ రెడ్డి ,ఎంపీడీవో నరేందర్ రెడ్డి ,పంచాయతీ రాజ్ ఏ ఈ ప్రసాద్ ,టీిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు ఏనబోయిన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.