Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేడు అధికంగా రానున్న భక్తులు
అ పోలీసు పహారాలో గంధం ఊరేగింపు కార్యక్రమం
నవతెలంగాణ- పాలకీడు
పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం కోడి కూయక ముందే దర్గా ముజావర్ జానీ బాబా నివాసం నుండి తయారుచేసిన గంధాన్ని డప్పు వాయిద్యాలతో ఉత్సాహభరిత వాతావరణంలోభక్తులతో ిదర్గాలోకి తీసుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి దర్గాలోని సమాధులను పాలాభిషేకంతో శుభ్రపరిచి గంధాన్ని ఎక్కించి నూతన అలంకరణలు చేశారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చే గంధం జాన్పహాడ్ దర్గా గ్రామాలలో ఊరేగింపు ఘట్టం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇప్పటికే భక్తుల రాకతో మొదటిరోజు దర్గా పరిసరాల్లో కోలాహలం నెలకొంది. నేడు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముంది. ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపును దష్టిలో పెట్టుకొని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.