Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల ఆదాయాలు రోజురోజుకు తగ్గిపోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కా ర్పొరేట్ శక్తుల ఆదాయాలు పెరిగిపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఆగహ్రం వ్యక్తం చేశారు. మరోపక్క ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మోయలేని భారాన్ని మోపిందని అన్నారు. ఇటీవల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించడం లేదని, వెంటనే ప్రభుత్వాలు పరిహారం అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజలు ఐక్యంగా నిలబడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సిద్ధం కావాలని కోరారు. నల్లగొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుల సైదులు, మండల కమిటీ సభ్యులు ఎండీ.అక్రమ్, రాంబాబు పాల్గొన్నారు.