Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ ఫొటో ఏర్పాటు చేయకుండా వేడుకలు ఎలా నిర్వహిస్తారని కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ పోటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య ప్రశ్నించారు. అంబేద్కర్ ఫొటో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్కులర్ జారీ చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఫొటో పెట్టాలని మూడేండ్లుగా ఉద్యమం జరుగుతున్నా అధికారుల్లో చలనం రాకపోవడం విచారకరమన్నారు.స్పందించిన శ్రీనివాస్‌రెడ్డి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ ఫొటో ఏర్పాటు చేసేటట్టు సర్య్కూలర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి జిల్లా నాయకులు బర్రె సుదర్శన్, బట్టు నర్సింగ్ రావు, కాకునూరి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.