Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరి
గౌడ కులస్తుల కుల వత్తి అయినా కల్లుఅమ్మి జీవనం సాగిస్తున్న గౌడ స్త్రీలను అవమాన పర్చే విధంగా తీసిన 'నాలో నేను' అనే తెలుగు సినిమా దర్శక,నిర్మాతలైన పి.ఎన్. రెడ్డి మదన్ బిజెలను ్ట ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసి,కఠినంగా శిక్షించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రశ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా, బీసీ రిజర్వేషన్ సాధన సమితి ,గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఈ సినిమా నిషేధించాలని, దర్శక,నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ప్లేకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నాలో నేను'' సినిమాలో గౌడ కులానికి చెందిన ఓ మహిళను వేశ్య లాగా చూపించి మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా సినిమా''ను తీయడమే కాకుండా యూట్యూబ్ లో ప్రవేశపెట్టిన ఈ సినిమాను నిషేధించాలన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా బీసీ రిజర్వేషన్ నియోజకవర్గ ఇంఛార్జ్ అనంతుల దేవాంజి గౌడ్ నియోజకవర్గ కార్యదర్శి పూజారి సైదులు, గౌడ సంఘం జిల్లా నాయకులు గిలకత్తుల రాము గౌడ్, బిసి, గౌడ సంఘాల నాయకులు అంబటి మహేష్, మహేశ్వరం సందీప్ నేత, మడిపల్లి అశోక్, మొగిలిపాక సాయి ముదిరాజ్,పెట్యం రాజు, తండు ప్రభాకర్, గిలకత్తుల సురేష్ గౌడ్, కారుపోతుల నరేష్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.