Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివద్ధి సాధ్యం అవుతుందని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికారులు రాకుండా తమ కింది స్థాయి అధికారులను పంపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.ప్రజా సమస్యలపై చర్చ కోసమే సర్వసభ్య సమావేశం అని, ఈ క్రమంలో అధికారులు గైర్హాజరైతే గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలన్నారు. అధికారులు సమావేశానికి హాజరు కాకపోతే ముందస్తుగా సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సమయపాలన పాటించని అధికారుల ప్రజాప్రతినిధులతో అభివద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.ప్రతి గ్రామంలో విద్యుత్, మంచినీటి సమస్య లేకుండా అధికారులు చూడాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన చెట్లను సంరక్షించే బాధ్యత సంబంధిత బాధ్యతలు ప్రజా ప్రతినిధులు తీసుకోవాలన్నారు .ఉపాధి హామీ చట్టంలో భాగంగా ప్రతి జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ వందరోజుల పని దినాలు కల్పించవలసిన బాధ్యత ఉపాధి హామీ అధికారులపై ఉందన్నారు. ఉపాధి హామీ లోభాగంగా పంట కల్లాలను ఏర్పాటు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా గ్రామాలలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకా తీసుకుని వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రతి గ్రామంలో 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తమ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దష్టికి తీసుకొచ్చారు.గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలను ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తహసీిల్దార్ రాంప్రసాద్,ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నవాకాంత్, మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్ ,వ్యవసాయ శాఖ అధికారి బాలకష్ణ ,ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ జాన్ ఫ్రెడ్, ఉద్యానవన శాఖ అధికారి శ్రవంతి, మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, ఏపీఓ వెంకన్న, ఏపీఎం ఆనంద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హసీనా తో పాటు వివిధ శాఖల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.