Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నల్లగొండ మండల దాసరిగూడెం జీపీ పరిధిలో రాజీవ్ స్వగహ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, గహ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాలననుసరించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఎంపీడీఓ, తహసీల్దార్లతో కలిసి శ్రీవల్లి టౌన్‌షిప్‌ను సందర్శించి ప్లాట్ లు ఈ ఆక్షన్ ద్వారా విక్రయం చేయుటకు లెవెలింగ్, విభజించిన ప్లాట్లకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ ప్లాట్ ఏరియాను లెవెలింగ్ చేయాలని పీఆర్డీఈని ఆదేశించారు. అదే విధంగా నక్ష ప్రకారం క్షేత్ర స్థాయిలో ఓపెన్ ప్లాట్ల విస్తీర్ణం, నంబరింగ్ ఉండాలని, ప్రస్తుతం 4 బ్లాక్‌లలో ఉన్న ప్లాట్లకు హద్దులు ఏర్పాటు, నంబరింగ్ చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. శ్రీవల్లి టౌన్ షిప్ లో 259 నిర్మాణం చేసిన ఇండ్లు, 574 ఓపెన్ ప్లాట్లు మొత్తం 833 ప్లాటింగ్ చేసి నంబరింగ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు 4 బ్లాక్‌లలో 4 టీమ్‌లను ఏర్పాటు చేయాలని, ఒక్కొక్క టీమ్ లో ఒక సర్వేయర్, హెల్పర్, ఇద్దరు లేదా ముగ్గురు లేబర్ ఏర్పాటు చేసి వారం రోజుల్లో హద్దులు ఏర్పాటు, నంబరింగ్ పూర్తి చేయాలని కోరారు. ఎంపీడీఓ, తహసీల్దార్ ప్రతి రోజూ సందర్శించి పనులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. టౌన్ షిప్ నుంచి గ్రామాన్ని కలిపేలా రహదారులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టౌన్ షిప్ లో సైట్ కార్యాలయం ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హెచ్ఎండీఏ ద్వారా ధర నిర్ణయించి పారదర్శకంగా ఈ ఆక్షన్ వేయనున్నట్లు, ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా ఈ ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య, తహసీల్దార్ పల్నాటి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ గుండగోని యాదగిరిగౌడ్, పంచాయతీరాజ్ ఏఈ బాలమోహన్ ఉన్నారు.
షిఫ్టింగ్ కు త్వరలో చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ : క్లాక్ టవర్ వద్ద ఉన్న ఇరిగేషన్ ఈఈ, ఏఈల కార్యాలయాన్ని పాత జెడ్పీ కార్యాలయంలోకి షిఫ్టింగ్ చేసేందుకు త్వరలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. గురువారం పాత జెడ్పీ కార్యాలయం ను సందర్శించి ఇరిగేషన్ ఈఈ కార్యాలయం షిఫ్టింగ్ పై ఇరిగేషన్ ఈఈ, పీఆర్ ఈఈలతో చర్చించి సూచనలు చేశారు. పాత జెడ్పీ కార్యాలయం పక్కన ఉన్న గదులలోకి ఇరిగేషన్ ఈఈ కార్యాలయం షిప్టింగ్ చేయుటకు అవసరమైన కలరింగ్, లైటింగ్, పార్టిషన్ వారం రోజుల్లో పూర్తి చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని పంచాయతీ రాజ్ ఈఈ, డీఈలను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, డీఈ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య ఉన్నారు.