Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరాజ్భట్
అ నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ-నల్లగొండ
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తేచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ భట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976 ను యధావిధిగా అమలు చేయాలని పేర్కొన్నారు. మెడిసిన్స్‌పై జీఎస్టీ రద్దు చేయాలని, బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఐదు శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్, మందుల కంపెనీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అమ్మకాలు తగ్గాయని పేరుతో వర్కర్లను తొలగింపులు ఆపాలని కోరారు. మందుల ధరలు నియంత్రించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల మార్పులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23, 24 తేదీలలో జరుగు జాతీయ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నల్లగొండ బ్రాంచ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చెరుపల్లి నిరంజన్, ప్రధాన కార్యదర్శిగా రావుల రవికుమార్, కోశాధికారిగా సోమ స్వామి, ఉపాధ్యక్షులుగా వాసు, పొలా శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా పోల రమేష్, జీవన్‌లతో పాటు మరో 13మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వళ్లందాస్ జగదీష్, కొత్తపల్లి సాయిరామ్, నిరంజన్, రవికుమార్, రమేష్, జీవన్, శ్రీనివాస్, మహేష్, కోట సుధాకర్, పాల్గొన్నారు.