Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే నోముల భగత్
నవతెలంగాణ-నిడమనూరు
నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని రేగుల గడ్డ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన మాట్లాడారు. రూ.150 కోట్లతో నియోజకవర్గంలో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండలంలోని రహదారుల ఏర్పాటుకు రూ.30కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి అత్యవసర పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. రాబోయే ఏప్రిల్ మాసంలో నూతన పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం నూతన పాలకవర్గ చైర్మెన్ జాలా పాపయ్య తోపాటు డైరెక్టర్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, మాజీ మార్కెట్ చైర్మెన్ నూకల వెంకటరెడ్డి, ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శి తాటి సత్యపాల్, నల్లబోతు వెంకటేశ్వర్లు, సర్పంచ్ జంగిలి రాములు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మతంగి రవి, ముకుందాపురం సర్పంచ్ కేశ శంకర్, మండలి సునీత రవికుమార్, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, మెరెడ్డి వెంకటరమణ, ఉన్నం ఈశ్వర్ పాల్గొన్నారు.