Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
టీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన కంచర్ల రామకష్ణారెడ్డిని గురువారం హైదరాబాద్ లో మోత్కూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బొకేలు, శాలువలతో ఘనంగా సన్మానించిశుభాకాంక్షలు తెలిపారు. మోత్కూరుకు చెందిన ఉద్యమ నాయకుడు రామకష్ణారెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి రావడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, రైతుబంధు మండలాల కోఆర్డినేటర్లు కొండా సోంమల్లు, తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గిరగాని శ్రీను, కందుల విక్రాంత్, కౌన్సిలర్లు వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, మాజీ ఎంపీటీసీలు జంగ శ్రీను, పానుగుళ్ల విష్ణుమూర్తి, యాదవ సంఘంఉపాధ్యక్షుడు జంగ వెంకటనర్సు, పాల్గొన్నారు.