Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామానికి చెందిన టీిఆర్ఎస్ నాయకులు జీడికల్లు మాతమూర్తి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. మతదేహాన్ని శుక్రవారం మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గాయం శ్యాంసుందర్ రెడ్డి, గడ్డం పశుపతి, శంకర్, కొరివి శివరాం పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వెంబాయి గ్రామ సర్పంచ్ అద్దెల నర్సిరెడ్డి ,ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ అద్దెల లింగారెడ్డి తండ్రి అద్దెల వెంకట్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి శుక్రవారం మాజీ శాసనసభ్యులు, ఉద్దీపన చైర్మెన్ వేముల వీరేశం హాజరయ్యారు. వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టీిఆర్ఎస్ చిట్యాల మండల మాజీ అధ్యక్షులు కాటం వెంకటేశం, బట్టు ఐలేష్, రాకేష్ శ్రీశైలం,కొసనం అశోక్, వార్డు సభ్యులు ఉన్నారు.