Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని పిల్లిగుండ్ల తండ గ్రామానికి చెందిన మాలోత్ నిర్మలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 45 వేల చెక్కును శుక్రవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, ఉపసర్పంచ్ ధీరావత్ బాల్ సింగ్, సర్పంచులు ఫోరమ్ అధ్యక్షుడు మెడబోయిన గణేష్ ,పూడూరి నవీన్ కుమార్ ,బొమ్మలరామారం ఉపసర్పంచ్ జూపల్లి భరత్, తదితరులు పాల్గొన్నారు.