Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చండూర్
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ గౌడ్ కోరారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులను జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్ర జెల్ల లింగయ్య , ఎండి షరీఫ్, జిల్లా నాయకులు జిన్నా భారు , అబ్బ బోయిన అంజయ్య,యూనస్, గంట అంజయ్య, తోకల యాదయ్య అనపర్తి మల్లేశం, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.