Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -గుండాల
ధాన్యం కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు శుక్రవారం ఒకప్రకటనలో కోరారు. మండలంలోని అంబాల, కొమ్మాయిపల్లి, పెద్దపడిశాల, సీతారాంపురం, వెల్మజాలలో ఐదు ఐకేపీ కేంద్రాల నుండి 640 రైతుల ద్వారా 2606.24 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, నెల రోజులు దాటినా రైతులందరికీ డబ్బులు జమ కాలేదని తెలిపారు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని కోరారు.