Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -రామన్నపేట
కేసీఆర్ సారథ్యంలో పల్లెలన్నీ ప్రగతి పథంలో దూసుకు వెళ్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని దుబ్బాక గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న హైస్కూలు ప్రహరీ గోడ నిర్మాణానికి, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, 5 లక్షలతో దుప్పల్లి గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠదామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్నారం గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు , సూరారం గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన వైకుంఠదామాన్ని ఆయన ప్రారంభించారు. కుంకుడుపాములలో 5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో పురాతన లింగమంతుల స్వామి దేవాలయ పునరుద్ధరణకు రూ.50 వేలా 116 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ రైతులతో పాటు కార్మికులు అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, టీిఆర్ఎస్మండల అధ్యక్షుడు మందడి ఉదరు రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నీల జయలక్ష్మి దయాకర్, ఎన్నారం గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి, గుత్త నరసింహారెడ్డి, బొక్క కష్ణవేణి పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ ఏనుగు పుష్పలత వెంకట్ రెడ్డి, దోమల సతీష్, ఉప సర్పంచ్ బిక్షం, పార్టీ ప్రధాన కార్యదర్శి పోచ బోయిన మల్లేశం, నాయకులు పున్న జగన్మోహన్, కంభంపాటి శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, గుండాల నరసింహ పాల్గొన్నారు.
చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే
సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి అందజేశారు. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు శ్రీను రూ.56 వేలు, పల్లివాడ గ్రామానికి చెందిన దండిగ మంజులకు రూ.18 వేలు, కళ్లెం అర్పితకు రూ.32 వేలు, బాచుప్పల గ్రామానికి చెందిన ఆవుల మత్స్యగిరికి రూ.44 వేలు, సతీష్‌కి రూ.52 వేలు, సూరారం గ్రామానికి చెందిన లావణ్యకు రూ.24 వేలను అందజేశారు.