Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి స్వామికి శుక్రవారం మాజీ శాప్ డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి యాదాద్రి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం మార్గమధ్యంలో ఉన్న యాచకులకు 111 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి సుమన్, మాగంటి శివకుమార్, గండ్రకోట రాంచందర్ పాల్గొన్నారు.