Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గలో, మండల పరిధిలోని అండర్ పాస్ , హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ స్థానిక నాయకులు బందెల సుభాష్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణకేంద్రంలో ఎంపీ కోమటిరెడ్డి వెంక్రెడ్డ్డికి మండల కేంద్రంలో వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పెద్దవాగు పై ఉన్న ఇరుకైన వంతెన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని , ఆలేరు బాహదూరు పేట మధ్యలో ఉన్న వాగు, కొలనుపాక మధ్యలోని వాగుపై, రాజపేట మండలంలోని పారుపల్లి దగ్గర ఉన్నలో లెవల్ వంతెనలపై హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.