Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ నాటిన మొక్కలకే దిక్కు లేదు
అ చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రభుత్వంహరితహారం కార్యక్రమాన్ని విడతలవారీగా చేపట్టి మొక్కలు నాటుతున్నది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి, నర్సరీల ద్వారా మొక్కలు పెంచేందుకు ఏటా కోట్లు ఖర్చు చేస్తోంది. నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మొక్కలు నాటిన ప్రదేశాల్లో ,పచ్చని మొక్కలు ఉండాల్సింది పోయి, ఎండిపోయినవి దర్శనమిస్తున్నాయి. అందుకు నిదర్శనంమే ఆలేరు మున్సిపల్ పరిధిలోని, పాత జాతీయ రహదారిలో సాయి బాబా గుడి దగ్గర ఒక ప్రయివేట్ వెంచర్ ఎదురుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గతంలో నాటిన మొక్కలు జాడ లేకుండా పోయాయి. మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాల్సిన అధికారులు మాత్రం నాటిన మొక్కలు ఏమైపోయాయో ఇంతవరకు తేల్చడం లేదు.అనేక ప్రాంతాల్లో మొక్కలను మేకలు తిన్న సందర్భాల్లో జరిమానా విధించిన సంఘటనలు ఉన్నాయి. ఇకనైనా నాటిన మొక్కలు ఏమైపోయాయో గ్రహించి, ఆ మొక్కలను నాశనం చేసిన సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ నాటిన మొక్కకే దిక్కు లేకుంటే ..మిగతా మొక్కలకు దిక్కేవరని, మున్సిపల్ అధికారులు ఆ మొక్కను కాపాడాల్సి ఉండగా, ప్రయివేటు వెంచర్ల పైసలకు కక్కుర్తి పడి,మొక్కలు లేకుండా చేయడం పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి,బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు,ప్రకతి ప్రేమికులు.