Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంల ఇండ్ల జాడే లేకుండా పోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో రూ.కోటీ 61 లక్షలతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మాచన్ పల్లి నుంచి నాగినేని పల్లి మెయిన్ రోడ్డు వరకు 3.2కిలోమీటర్ల నూతన బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు మంజూరైందన్నారు. మాచినపల్లి , హజీపూర్ గ్రామాలను కలిపే బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఒకవేళా మంజూరైనా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఆ ఇండ్లు కేటాయిస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టిపల్లి లక్ష్మమ్మ, తిరుమల కవిత, ఎంపీపీి సుధీర్ రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సింగిల్విండో చైర్మెన్ బాల నరసింహ, ఎంపీటీసీ పక్కిర్ రాజేందర్ రెడ్డి ,ఆయా గ్రామ సర్పంచులు ,ఎంపీటీసీలు, తదితరులు, నాయకులు పాల్గొన్నారు.