Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ ఎల్. రమణ
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
చేనేతకు జీరో జీఎస్టీ సాధించేవరకు పోరాటం ఆగదని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. చేనేతకు జీరో జీఎస్టీకోసం అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం పిలుపులో భాగంగా లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని శుక్రవారం పట్టణకేంద్రంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూదాన ఉద్యమానికి, చేనేతకు పోచంపల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీ 5 శాతం నుండి 12 శాతం పెంచడం వల్ల చేనేత కార్మికులు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఏ ప్రభుత్వం చేనేత పై ఇంత జీఎస్టీ విధించలేదన్నారు. జీరో జీఎస్టీ ప్రాధాన్య అంశంగా తీసుకుని దేశవ్యాప్త కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇక్కడ చేపట్టిన కార్యక్రమంతో కేంద్రానికి కనువిప్పు కలిగేలా చేయాలని పిలుపునిచ్చారు .కేంద్రం దిగి వచ్చే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీ అందరికీ అందే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాట్లాడుతూ జీఎస్టీ రద్దు పై పార్టీలకతీతంగా పట్టుదలతో ఉద్యమం చేయాలన్నారు. అందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలోఅఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న నేత, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్ సుంకార్వార్, ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబు రావు, టై అండ్ డై అధ్యక్షుడు తడక రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి శ్రీనివాస్, అఖిలభారత పద్మశాలి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్ తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.