Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
ఢిల్లీ కస్తూర్బాలో యువతీపై సామూహిక లైంగికదాడి ఘటనలో బాధ్యులైన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. లైంగికదాడి ఘటనను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 73 ఏండ్ల ప్రజాస్వామిక భారతంలో ఇలాంటి ఉన్మాద ఘటనలు పునరావతమవుతుంటే చోద్యం చూస్తోందన్నారు. దేశ రాజదాని నడిబొడ్డున గుండు గీయించి తోటి మహిళలే లైంగికదాడికి పురిగొల్పడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించి యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం,డ్రగ్స్,పోర్న్ సైట్స్ పై కఠినంగా వ్యవహరింలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షురాలు కల్లూరి నాగమణి, బి.భావన, కే.పావని, క.అనిత, బి.రమ్య, శభీనా, బి.జయశ్రీ, నజియా తదితరులు పాల్గొన్నారు.