Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
నవతెలంగాణ- నల్లగొండ
జిలాలొ భూముల మార్కెట్ విలువ సవరింపునకు సర్వం సిద్ధమైంది.. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతాయి. ఈ అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వారం రోజులుగా తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో బహిరంగ మార్కెట్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్టుమెంట్ల ధరలను తెప్పించుకుంది. ఆయా కేటగిరీల్లో నెల వారీగా జరుగుతున్న క్రయవిక్రయాల సమాచారాన్ని సేకరించింది. జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు అందజేసిన నివేదిక ప్రకారం 20శాతం మార్కెట్ విలువల పెంపుపై అధికారలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గురువారం హైదరాబాద్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులు ఆయా జిల్లాల రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్వోలు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై మార్కెట్ విలువల ప్రతిపాదనలు, కొత్త విలువల అమలు తీరుపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కిటకిటలాడుతున్న కార్యాలయాలు
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్టు మెంట్లు, భవనాలు తదితర స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1నుంచి పెరుగనున్న నేపథ్యంలో జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి నమోదైన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే గురువారం,శుక్రవారం ఒక్క రోజే రాత్రి 9 గంటల వరకు అధికారులు 185 ప్లాట్లకు రేట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు సగటున 30 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగేది. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 185కి పెరిగింది. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా లావాదేవీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో కొనుగోలు, అమ్మకం దారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు. జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల నమోదు 50శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు కార్యాలయాల్లో పడిగాపులు పడుతూ కనిపిస్తున్నారు.
భౌతిక దూరం ఏది
ఒకపక్క కరోనా విజంభిస్తున్న నేపథ్యంలో మరోపక్క భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అధికారులు , ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించినా.. భౌతిక దూరాన్ని మాత్రం పాటించలేదు.