Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మున్సిపల్ వైస్చైర్మెన్గా చల్ల శ్రీలతారెడ్డి రెండేండ్లుగా పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం టీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో పేద విద్యార్థినులకు రూ.25 వేల విలువ గల నాలుగుసైకిళ్లను చల్ల శ్రీలతరెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు,పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు,కౌన్సిలర్ షేక్ భాషా, గ్రంథాలయ చైర్మెన్ గుర్రం మార్కండేయ,టీఆర్ఎస్ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు,ఇంజమూరి రాములు, వేమూరి నారాయణ, కొణతం ఆదిరెడ్డి,బుడిగే చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు పోకబత్తిని రాజేష్,ఇంజమూరి రాజేష్,పుల్లయ్య,వెంకట్,రియాజ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.