Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారంతో ముగిశాయి.మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.చివరి రోజు ఎంపీపీ భూక్యా గోపాల్‌నాయక్, బెట్టేతండా సర్పంచ్ మోతీలాల్, ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షుడు మీసాల ఉపేందర్, నిమ్మనాయక్, కాంగ్రెస్ మండల నాయకుడు నర్సింహారావు దర్గాను దర్శించుకున్నారు.. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో.. జాన్ పాక్ షహీద్, మొయినుద్దీన్ షహీద్ పవిత్ర సమాధులపై ముజావర్లు ( దర్గా పూజారులు ) దీపాలు వెలిగించి.. ఉర్సు చివరి అంకాన్ని ముగించారు.ఇక నుంచి రెండు రోజుల పాటు దర్గా పరిసరాలను శుభ్రపరుస్తామని వక్ప్‌బోర్డు అధికారులు తెలిపారు.