Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అధ్యక్షతన సాదాసీదాగా కొనసాగింది.సభ ప్రారంభం కాగానే సిరిపురం ఎంపీటీసీ బడుగు రమేష్ ఎంపీపీ, అధికారుల నిర్లక్ష్య వైఖరికి, లెక్కలేని తనానికి, చేసిన తీర్మానాలు అమలు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మిగతా ఎంపీటీసీలను లెక్క చేయకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీలు మాడురి జ్యోతి, వనం హర్షిణి, ఎండి రేహన్, వేమవరం సుధీర్ బాబు, ఎర్రోళ్ళ లక్ష్మమ్మలు వాకౌట్ చేశారు.అనంతరం సభలో వ్యవసాయ అధికారి యాదగిరిరావు బోయ గాలయ్య, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ ప్రశాంత్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ నర్సింహ, పశు వైద్యాధికారి శ్రీధర్‌బాబు, ఏపీఎం అంజయ్య, ఏపీఓ వెంకన్న అధికారులు ఆయా శాఖల ప్రగతిని వివరాలు సభ దష్టికి తెచ్చారు.సమావేశం ముగించారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ రెడ్డి, వైస్‌ఎంపీపీ ఖాదర్, పీఏసీఎస్ చైర్మెన్ భిక్షంరెడ్డి, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ, దోమల సతీష్, గాదే పారిజాత ముకుందం, ఏనుగు పుష్పమ్మ, గోగు పద్మా సత్తయ్య, కో ఆప్షన్ సభ్యులు ఆమేర్, సర్పంచులు సోమయ్య, అధికారులు,సీడీపీఓ శైలజ, ప్రభుత్వాస్పత్రి వైద్యులు వీరన్న, సీనియర్ అసిస్టెంట్ ఆర్వీ.సత్యనారాయణ పాల్గొన్నారు.