Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
స్థానిక ఎంపీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూన్నారని, ఎంపీటీసీలకు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీర్మానం లేకుండా పనిచేస్తూ మండల పరిషత్ నిధులను ఉద్దేశ్య పూర్వకంగా ఎంపీటీసీలకు ఇవ్వమని చెప్పడానికి నిరసనగా శుక్రవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని టీిఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి, కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ మూడేండ్లుగా మండల పరిషత్‌కు వచ్చే నిధుల వివరాలు, ఖర్చులు అడిగినా ఎలాంటి సమాధానమివ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు.మెజారిటీ ఎంపీటీసీలు లేకున్నా ఏకపక్షంగా అధికారపక్షం అండతో తీర్మానం లేకున్నా పనులు ఇష్టమున్న చోట్ల చేస్తున్నారన్నారు.మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో సంబంధం లేకుండా, కనీసం సభలో చర్చ చేయకుండా, తీర్మానాలు లేకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.మండల అధికారులు సైతం ప్రోటోకాల్ పాటించడం లేదని సభ దష్టికి తీసుకువచ్చినా వ్యవహార శైలిలో మార్పు లేదన్నారు.ఇప్పటికే ఒకవైపు ఎంపీటీసీలుగా గెలిచి మూడేండ్లవుతున్నా నిధులివ్వకపోవడంతో గ్రామాలలో ప్రజలకు ఎలా మొహం చూపించాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బడుగు రమేష్, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్, టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఎండి రెహన్, మాడూరి జ్యోతి, కాంగ్రెస్ ఎంపీటీసీలు వనంహర్షిణి, వేమవరం సుధీర్‌బాబు, సీపీఐ(ఎం) ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఇండిపెండెంట్ ఎంపీటీసీ పూస బాలమణి తదితరులు పాల్గొన్నారు.