Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.10 లక్షల దళితబంధు ఎక్కడ
అ లబ్దిదారుల ఎంపిక పూర్తైనా అమలు కాని దళితబంధు
అ ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి
నవతెలంగాణ-తిరుమలగిరి
నాగరం మండలం విజరునగర్లో కడియం సోమక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమానికి శనివారం దుబ్బాక ఎమ్మెల్యే రఘనందనరావు హాజరయ్యారు.తదుపరి తిరుమలగిరిలోని కడియం రామచంద్రయ్య నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో అయన మాట్లాడుతూ నేటికీ దళితబందు పథకం ఆవిష్కరింపబడి నాలుగు నెలలు కావస్తున్నా కనీసం పైలట్ ప్రాజెక్ట్ మండలలో అయినా పథకం నేటికీ అర్హులకు చేరలేదన్నారు.తెలంగాణలోని ప్రతి నియోజక వర్గానికి 100 మంది లబ్దిదారులకు పథకం అమలుచేస్తానన్న ముఖ్యమంత్రి కెేసీఆర్ వాగ్దానాలకు అతీగతీ లేదని ఎద్దేవా చేశారు.కేవలం టీఆర్ఎస్ హుజూర్నగర్ ఎన్నికల స్టంట్గా మాత్రమే దళితబంధును ఉపయోగించుకుందని ఆరోపించారు.కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఫైలెట్ ప్రాజెక్టు మండలాల్లో దళితబంధును అమలు చేయాలని కోరారు.తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశిొనచారు.ఏడాది కింద అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఏడాది గడిచినా ఇప్పటికీ అమలు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీని దాడులతో అణిచివేయాలని చూడడం ఎంతవరకు సమంజసం అన్నారు.చదువుకున్న విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో అభివద్ధి బాగా జరుగుతుంది అనుకున్నరూ ...ఈప్రాంత ప్రజలు దళితబంధు అమలు అమలవుతుంది అనుకున్నాం కానీ ఏమైందని ప్రశ్నించారు.టీఆర్ఎస్ నాయకులుగా మారితే ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతులు లభిస్తాయన్నారు.జీఓ 317 సంబంధించి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రిని అడిగినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. ఫిబ్రవరి 5 లోగా అభ్యర్థుల ఎంపికలో గైడ్లైన్స్ లేకుండా ఎలా పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రిని అడుగుతున్నామని ప్రశ్నించారు.ఉద్యోగులు, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగ నిరుద్యోగ హత్యలు, ప్రభుత్వహత్యగా భావించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన దళితబంధు నియోజకవర్గాల్లో ఎంపిక చేయబడిన ప్రజలందరికీ రూ.10 లక్షలిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, ప్రధానకార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, బొలిశెట్టి కష్ణయ్య ఓబీసీ జిల్లా కన్వీనర్ నరేష్, మండలఅధ్యక్షులు దీనదయాల్, యాదగిరి,నాయకులు బాలకష్ణ, చిరంజీవి, శంకర్, కడియం సోమన్న, మూల వెంకటరెడ్డి, వెంపటినర్సింహారెడ్డి, హరీష్ పాల్గొన్నారు.