Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
గ్రామాల సర్వతోముఖాభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.శనివారం మండలంలోని సీతారామాపురం, కొండాపురంగూడెం,మాధవ్గూడెం గ్రామాలలో డంపింగ్‌యార్డులు, హరిత హారం, శ్మశానవాటికలను ప్రారం భించారు.అనంతరం మాట్లా డుతూ 70 ఏండ్ల నుండి నేటి వరకు గ్రామాలలో అభివద్ధి జరగకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఏడేండ్లలో 70 ఏండ్ల అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత,డంపింగ్‌యార్డులు, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక తీయడం వల్ల గ్రామాల్లో పచ్చదనం విరాజిల్లుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య, జెడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,ఆయా గ్రామాల సర్పంచులు వేనేపల్లి సుగుణమ్మ నర్సింహారావు, మాదాసు లింగయ్య, బేతవోలు పీఏసీఎస్ చైర్మెన్ భాష్యం సైదులు, ఉపసర్పంచ్ యాదాలవీరస్వామి,వేనేపల్లి వెంకటేశ్వర్రావు, వేనేపల్లి ఉప్పి,వట్టికూరి నాగయ్య పాల్గొన్నారు.