Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని వల్లభాపురం పంచాయతీ కార్యదర్శి అరుణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చేల్మ తండ గ్రామ పంచాయతీ కి బదిలీ అయ్యి వెళ్లినందున శనివారం వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వీడ్కోలు సన్మానం సర్పంచ్ జీడిమెట్ల నాగలక్ష్మి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.అరుణ ఈ గ్రామానికి ఆరేండ్లుగా అందించిన సేవలను కొనియాడారు.అనంతరం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో గోపి, ఉప సర్పంచ్ రవీందర్, ఇన్చార్జి కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు సుమలత, లక్ష్మీ, అనిత, రజిత, నాగరాజు, ఎఎన్ఎం మంగమ్మ, అంగన్వాడీ టీచర్ లీల, ఆశా వర్కర్లు శాంతి మమత, మంగ,గ్రామపెద్దలు లింగయ్య, శ్రీను, ఝాన్సీ, మౌలానా, గ్రామపంచాయతి సిబ్బంది రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.