Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఘనంగా సన్మానించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన సందర్శించారు.కొత్తగూడెంలో వంద పడకల వైద్యశాలను ప్రారంభించి అనంతరం సూర్యాపేటకు వెళుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ఆగారు.టీఆర్ఎస్ నాయకులు మంత్రి హరీష్‌రావుకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో 20 పడకల పిల్లల వార్డు ప్రారంభం తో పాటు మెడికల్ కళాశాలలో వైద్య అధికారులతో వైద్యాధికారులతో అత్యవసర సమావేశం ఉండడంతో ఆయన హుటాహుటిన తిరిగివెళ్లారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి , మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, గ్రంథాలయ చైర్మెన్ రహీం, టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు వంశీనాని, యువ నాయకులు బత్తుల ఉపేందర్, కౌన్సిలర్లు కల్లూరి పద్మజ,నాయకులు పాల్గొన్నారు.